IPL: అట్టహాసంగా ఐపీఎల్ ప్రారంభ వేడుకలు 1 y ago
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ఈనెల 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ప్రారంభోత్సవ వేడుకలో బాలీవుడ్ తారలు షారుఖ్ ఖాన్, సల్మాన్, విక్కీ కౌశల్, సంజయ్ దత్ పాల్గొంటారని సమాచారం. అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్ సంగీత ప్రదర్శనలు చేయనున్నారు. శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్, దిశా పటానీ స్పెషల్ డ్యాన్స్ షో నిర్వహించనున్నారు. పంజాబ్ ర్యాపర్ కరణ్ ఔజ్ణా కూడా ప్రదర్శన ఇవ్వనున్నారు. వన్ రిపబ్లిక్ బృందం కూడా పాల్గొనే అవకాశం ఉంది.